ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్

ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు:  విశాల్


 ‘‘ఏడేళ్ల క్రితం హరి దర్శకత్వంలో ‘భరణి’ చిత్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు మంచి కథ కుదరడంతో ఈ సినిమా చేశాం’’ అని విశాల్ చెప్పారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘పూజ’. శ్రుతీ హాసన్ కథానాయిక. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న నితిన్ ప్రచార చిత్రాన్ని విడుదల చేయగా, ఆడియో సీడీని శ్రుతీహాసన్ ఆవిష్కరించి నితిన్‌కి ఇచ్చారు.

 

 విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ చిత్రం గురించి విశాల్ మాట్లాడుతూ -‘‘ఇందులో నాది చాలా మంచి పాత్ర. ఇలాంటి అబ్బాయి తమ కుటుంబంలో ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. యువన్ ఇచ్చిన పాటలు, కనల్ కణ్ణన్ సమకూర్చిన ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశానని శ్రుతీ హాసన్ చెప్పారు. ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రమని, పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమని హరి తెలిపారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top