షారుక్పై సల్మాన్ ప్రశంసల వర్షం | SRK praises Salman Khan for being courteous, gracious | Sakshi
Sakshi News home page

షారుక్పై సల్మాన్ ప్రశంసల వర్షం

Sep 16 2014 4:08 PM | Updated on Apr 3 2019 6:23 PM

షారుక్పై సల్మాన్ ప్రశంసల వర్షం - Sakshi

షారుక్పై సల్మాన్ ప్రశంసల వర్షం

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్పై బాద్షా షారుక్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్పై బాద్షా షారుక్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా గౌరవంగా ఉంటాడని, స్నేహపూర్వకంగా ఉంటాడని చెప్పాడు. సాధారణంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుందనే స్థాయిలో గొడవలున్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం 'భాయీ.. భాయీ' అనుకుంటూ చేతులు కలుపుకొని కనిపిస్తున్నారు. 'బిగ్ బాస్ 8' కార్యక్రమంలో షారుక్ ఖాన్ నటించిన 'హేపీ న్యూ ఇయర్' చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేశాడు.

షారుక్ కూడా ఈ అవకాశాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఏ సినిమాకైనా మార్కెటింగ్ అవసరమని, అదే తాము కూడా చేశామని.. తమను ఎక్కడకు ఆహ్వానించినా సంతోషంగా వెళ్తామని చెప్పాడు. సల్మాన్ భాయ్ చాలా గౌరవంగా, స్నేహపూర్వకంగా ఉంటాడని, ఆయన కూడా తమతోపాటు వస్తే బాగుంటుందని భావిస్తున్నామని అన్నాడు. తమకు ఏమాత్రం సమయం ఉన్నా అక్కడకు వెళ్తామని, ఒకవేళ వెళ్లలేకపోతే మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement