చల్లని రాత్రిలో షారుక్కు వెచ్చటి కానుక | SRK gifted leather jacket to beat Amsterdam chill | Sakshi
Sakshi News home page

చల్లని రాత్రిలో షారుక్కు వెచ్చటి కానుక

Sep 22 2016 11:50 AM | Updated on Sep 4 2017 2:32 PM

చల్లని రాత్రిలో షారుక్కు వెచ్చటి కానుక

చల్లని రాత్రిలో షారుక్కు వెచ్చటి కానుక

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆయన అభిమానులు వెచ్చటి కానుకను పంపించారు.

ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆయన అభిమానులు వెచ్చటి కానుకను పంపించారు. ప్రస్తుతం ఆమ్స్టర్డాంలో షూటింగ్ లో ఉన్న ఆయనకు చలి నుంచి బయటపడేందుకు కొంతమంది బాయ్స్ స్వచ్ఛమైన లెదర్ జాకెట్ ను పంపించారు. ఈ సందర్భంగా అభిమానులు పంపించిన గిఫ్ట్ ను ఫొటో తీసి దానికి..

'ఆమ్స్టర్డాంలోని చల్లటి రాత్రిలో షూటింగ్. వెచ్చదనం కోసం అమ్మాయిలు కౌగిలిని పంపించగా అబ్బాయిలు ఓ స్వచ్ఛమైన లెదర్ జాకెట్ను గిఫ్ట్ గా కొరియర్ చేశారు' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'ది రింగ్' అనే చిత్రంలో షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా అనుష్క శర్మ నటిస్తోంది. అలీ దర్శకత్వంలో సినిమా చేయడం షారుక్ కు ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
Advertisement