శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్లు ఎంతో తెలుసా? | 'Srirastu Subhamastu' mints Rs 11 crore in nine days | Sakshi
Sakshi News home page

శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్లు ఎంతో తెలుసా?

Aug 15 2016 5:34 PM | Updated on Sep 4 2017 9:24 AM

శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్లు ఎంతో తెలుసా?

శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్లు ఎంతో తెలుసా?

అల్లు కుటుంబం ట్యాగ్ పెట్టుకుని టాలీవుడ్‌లోకి వచ్చినా.. ఇప్పటివరకు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్‌కు మంచి హిట్ దొరికింది.

అల్లు కుటుంబం ట్యాగ్ పెట్టుకుని టాలీవుడ్‌లోకి వచ్చినా.. ఇప్పటివరకు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్‌కు మంచి హిట్ దొరికింది. తాజాగా శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి 9 రోజుల్లో మొత్తం రూ. 11 కోట్లు వసూలు చేసింది. ఇంతకుముందు శిరీష్, రెజీనా జంటగా నటించిన కొత్త జంట సినిమా వసూలుచేసిన మొత్తం కంటే ఈ మొదటి 9 రోజుల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. శిరీష్ కెరీర్‌లోనే ఇది అత్యంత పెద్ద హిట్‌గా చెప్పుకోవచ్చని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ అన్నారు.

ఇటు ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఈ సినిమాకు గాను అల్లు శిరీష్ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సినిమా సక్సెస్‌ మీట్‌లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అల్లు వారి చిన్నోడిపై ప్రశంసలు కురిపించారు. తాను శిరీష్‌ను, అల్లు అర్జున్‌ను, మహేశ్ బాబును బాలనటులుగా చాలాకాలం క్రితం పరిచయం చేశానని, ఇప్పుడు శిరీష్ మంచి నటుడిగా ఎదగడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. భారీ హీరోయిజం చూపించే సినిమాలు కాకుండా.. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకోవడం బాగుందని చెప్పారు. 2013లో గౌరవం సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్.. ఆ తర్వాత కొత్తజంట, తాజాగా శ్రీరస్తు శుభమస్తు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement