ఇంకా సాధించాల్సింది ఉంది! | Srikanths New Film Rechristened Veediki Dookudekkuva | Sakshi
Sakshi News home page

ఇంకా సాధించాల్సింది ఉంది!

Dec 1 2015 2:15 AM | Updated on Sep 3 2017 1:16 PM

ఇంకా సాధించాల్సింది ఉంది!

ఇంకా సాధించాల్సింది ఉంది!

‘‘ఈ మధ్య కాలంలో నాకు సరైన విజయాలు రాలేదన్న మాట నిజమే. ‘వీడికి దూకుడెక్కువ’ సినిమా మాత్రం ఆ లోటు తీరుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు.

‘‘ఈ మధ్య కాలంలో  నాకు సరైన విజయాలు రాలేదన్న మాట నిజమే.  ‘వీడికి దూకుడెక్కువ’ సినిమా మాత్రం ఆ లోటు తీరుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సత్యం ద్వారపూడి దర్శకత్వంలో శ్రీకాంత్, కామ్నా జెత్మలానీ జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  శ్రీకాంత్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్‌లో ‘ది బెస్ట్’ సినిమా ఇది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

పరిశ్రమకు వచ్చి చాలా కాలమైనా ఇంకా సముద్రంలో ఈదుతున్నట్టే ఉంది. ఇంకా సాధించాల్సింది ఉంది.  ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓ హారర్ చిత్రంలో నటిస్తున్నా. ‘అమ్మ’ రాజశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇక మా అబ్బాయి రోషన్  సంగతంటారా! తను ఇంకా చిన్నపిల్లాడే.

వాడి భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం  తొందరపాటే  అవుతుంది. మొన్నీ మధ్యే ‘రుద్రమదేవి’లో నటించాడు. ప్రస్తుతం  ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. హీరోగా వాడు పెద్ద స్థాయికి చేరుకుంటాడా లేదా అన్నది వాడి అదృష్టమే’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement