అందరూ మెచ్చే 'బ్రహ్మోత్సవం' | Srikanth Addala gearing up for Brahmotsavam | Sakshi
Sakshi News home page

అందరూ మెచ్చే 'బ్రహ్మోత్సవం'

Aug 17 2015 9:11 AM | Updated on Sep 3 2017 7:37 AM

మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరుగుతుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.

సింహాచలం:  మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరుగుతుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.  ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను తీసిన 'కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మాదిరిగా ఆకట్టుకుంటుందన్నారు. 

 

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల, ప్రిన్స్ కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  బ్రహ్మోత్సవం చిత్రం కూడా పూర్తిగా కుటుంబకథా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మహేశ్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా శ్రీకాంత్ అడ్డాల నిన్న కుటుంబ సమేతంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తర పూజ జరిపారు. సంప్రదాయం ప్రకారం ఆలయ వర్గాలు ఆయనకు ప్రసాదం అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement