నో సెల్ఫీ బేబీ! | Sridevi Has Apparently Banned Her Daughters From Posting Selfies On Social Media | Sakshi
Sakshi News home page

నో సెల్ఫీ బేబీ!

Feb 13 2017 2:12 PM | Updated on Sep 5 2017 3:33 AM

నో సెల్ఫీ బేబీ!

నో సెల్ఫీ బేబీ!

ఇవాళ జీవన విధానంలో సెల్‌ఫోన్లు ఎలా ఒక భాగంగా మారాయో, సెల్ఫీ ఫొటోల సంస్కృతి ఎక్కువవుతోందన్నది వాస్తవం.

ఇవాళ జీవన విధానంలో సెల్‌ఫోన్లు ఎలా ఒక భాగంగా మారాయో, సెల్ఫీ ఫొటోల సంస్కృతి ఎక్కువవుతోందన్నది వాస్తవం. సెల్‌ఫోన్లలో సెల్పీ ఫొటోలు తీసుకోవడం, వాటిని ఇంటర్నెట్లలో పోస్ట్‌ చేయడం యువతకు ఒక పిచ్చిగా మారిందనే చెప్పాలి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి వారుసురాలికి అలాంటి పిచ్చి బాగా ఉందట. శ్రీదేవికి జాన్వి, ఖుషీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. వారిద్దిర్ని హీరోయిన్లుగా చేసే ప్రయత్నంలో శ్రీదేవి ఉన్నారు.అయితే ఇప్పటికే జాన్వీకి హీరోయిన్ గా తమిళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వచ్చినా శ్రీదేవి తోసిపుచ్చారు.అయితే జాన్వి చిత్ర పరిచయానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.

హిందీలో కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో నటించడానికి జాన్వి ఎన్నికయ్యారు. ఈ అమ్మడికి సెల్ఫీ పిచ్చి బాగా ఉందట. తన సెల్ఫీ ఫొటోలను, ఇతరులతో దిగిన సెక్సీ సెల్ఫీ ఫొటోలను వెంటనే వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయడం జాన్వీకి ఒక వ్యసనం లాంటిదట. నటిగా రంగప్రవేశం చేయనున్న జాన్వీని సెల్ఫి ఫొటోలు తీసుకోవద్దని ఆమె తల్లి శ్రీదేవి స్ట్రిక్ట్‌గా హెచ్చరికలు జారీ చేశారట.అలా సెల్ఫీల పిచ్చి వల్ల నటనపై ఏకాగ్రత లోపిస్తుందని, అంతే కాకుండా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హితవు కూడా చెప్పారట. మరి తల్లి మాటను జాన్వీ ఎంత వరకూ పాటిస్తుందో వేచి చూడాలి.

సాధారణంగా తమ చిత్రాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకునేటప్పుడు దర్శక నిర్మాతలు వారికి విధించే షరతుల్లో హీరోలతో డేటింగ్‌ చేయరాదన్నది కూడా ఉంటుంది. అలా డేటింగ్‌ వారి మధ్య ప్రేమగా మారి ఎక్కడ షూటింగ్‌కు ఆటంకంగా మారుతుందోనని వారి భయం కావచ్చు.అయితే ఇవన్నీ కొత్తగా పరిచయం అయ్యే తారలకే చెందుతాయి సుమండీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement