శ్రీదేవి ఒప్పేసుకున్నారా? | Sakshi
Sakshi News home page

శ్రీదేవి ఒప్పేసుకున్నారా?

Published Fri, Nov 25 2016 9:47 AM

శ్రీదేవి ఒప్పేసుకున్నారా?

శ్రీదేవి, బోనీ కపూర్‌ దంపతుల పిల్లలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌కు స్టార్‌ కిడ్స్‌గా బాలీవుడ్‌లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్‌ టు లిప్‌ కిస్‌ చేసుకున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి.
 
ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదని కథనాలు కూడా వచ్చాయి. తాజాగా షారుఖ్ ఖాన్, అలియా భట్ లు నటించిన 'డియర్ జిందగీ' స్క్రీనింగ్ కు శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్‌ లు కలిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో శ్రీదేవి, బోనీ కపూర్లు జాన్వి, శిఖర్ ల రిలేషన్ షిప్ ను అంగీకరించారనే వార్తలు కూడా వస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement