లారెన్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి!

Sri Reddy Sensational Comments on Raghava Lawrence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది. అనంతరం శ్రీరెడ్డి సినీ ప్రముఖులపై సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌, నాని సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌పై ఆరోపణలు చేయగా, తాజాగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరో  రాఘవ లారెన్స్ పై సంచలన ఆరోపణలు చేశారు. 

‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానన్నారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తరువాత లారెన్స్‌ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనంతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్‌తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారన్నారని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top