గడ్డం పెంచి గట్టిగా ప్రసంగిస్తే చెగువేరా? : శ్రీరెడ్డి

Sri Reddy Comments Again on Pawan Kalyan - Sakshi

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్‌, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో పలువురు సినీ సెలబ్రిటీల గుట్టు విప్పిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌ మీద కూడా పడ్డారు. అయితే తాజాగా శ్రీరెడ్డి పరిటాల రవి పేరు చెప్పుకుంటూ.. సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ కలకలం రేపుతోంది. 

శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై జనసేన అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top