శ్రీ విష్ణు కొత్త సినిమా లాంచ్‌

Sree Vishnu New Movie Launched, Directed By Hasith Goli - Sakshi

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో నూతన సినిమా లాంచ్‌ అయింది. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హాసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోదం, డ్రామా కలగలిపిన ఈ చిత్రం వైవిధ్యంగా సాగుతుందని చిత్ర దర్శకుడు హాసిత్ గోలి తెలిపారు.

శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేకసాగర్, ఛాయాగ్రహణం: వేదరామన్, సహ నిర్మాతలు: వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top