ఆరు దేశాల్లో స్పైడర్ పనులు..! | Spyder post production work in 6 countries | Sakshi
Sakshi News home page

ఆరు దేశాల్లో స్పైడర్ పనులు..!

Jul 13 2017 12:57 PM | Updated on Jul 23 2019 11:50 AM

ఆరు దేశాల్లో స్పైడర్ పనులు..! - Sakshi

ఆరు దేశాల్లో స్పైడర్ పనులు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ పనులు ఏకంగా ఆరు దేశాల్లో జరుగుతున్నాయని చిత్ర నిర్మాతలు తెలిపారు.

యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఉందట. అందుకే అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసేందుకు ఆరు దేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్స్ సినిమాకు గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అంతేకాదు బాహుబలి రిలీజ్ తరువాత స్పైడర్ను మరింత భారీగా రూపొందిస్తున్న చిత్రయూనిట్ మహేష్తో మరో షెడ్యూల్ స్పెషల్ గా షూటింగ్ చేశారు.

మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరో పాటను వచ్చే నెలలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement