గుమ్మడికాయ కొట్టేశారు... హాలీ హాలీతో వస్తున్నారు | Spyder film will be released as a on September 27. | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టేశారు... హాలీ హాలీతో వస్తున్నారు

Sep 2 2017 12:07 AM | Updated on Jul 23 2019 11:50 AM

గుమ్మడికాయ కొట్టేశారు... హాలీ హాలీతో వస్తున్నారు - Sakshi

గుమ్మడికాయ కొట్టేశారు... హాలీ హాలీతో వస్తున్నారు

మహేశ్‌బాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్‌’.

మహేశ్‌బాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. రొమేనియాలో చిత్రీకరించిన చివరి పాటతో సినిమా పూర్తయింది. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

అంతకంటే ముందు మ్యూజిక్‌ సింగిల్స్‌తో (ఒక్కో పాట విడుదల చేస్తూ) సందడి తీసుకు రావడానికి ప్లాన్‌ చేసింది చిత్రబృందం. ఆల్రెడీ విడుదలైన ‘బూమ్‌ బూమ్‌’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి తోడు ఈ నెల 4న సెకండ్‌ సింగిల్‌ ‘హాలీ హాలీ...’ను విడుదల చేస్తామని ప్రకటించారు. మహేశ్, రకుల్‌ స్టెప్పులేసిన ఈ డ్యూయెట్‌ ఎలా ఉండబోతుందో వెయిట్‌ అండ్‌ సీ!! హ్యారీస్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement