భారత్‌లో ఒక రోజు ముందుగానే!

Spider Man Far From Home to Release in India a Day Earlier - Sakshi

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ‘స్పైడ‌ర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోం’ రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి ‘స్పైడ‌ర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోం’ సిద్ధమ‌వుతోంది. ఈ చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది.

ఇంగ్లీష్‌‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్రమంగా పెరుగుతుంది. ఈ సంద‌ర్భంగా సోనీ పిక్చర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్నాని మాట్లాడుతూ ‘సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది.

ప్రారంభం నుండే స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్రమ్ హోంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం’ అని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top