తాతగారి  బయోపిక్‌  చూడాలని ఉంది

Special chit chat with hero naga chaitanya - Sakshi

‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై యంగ్‌ టాలెంట్‌ని, కొత్త కథలని ప్రమోట్‌ చేయాలనుకుంటున్నాం. ఇక నుంచి ప్రతి మంచి సినిమా మీద మా లోగో చూడాలని అనుకుంటున్నాం. నేను కూడా ప్రొడక్షన్‌లో భాగం అవుదాం అనుకుంటున్నాను’’ అన్నారు నాగచైతన్య.  సుశాంత్‌ హీరోగా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. రుహానీ శర్మ కథానాయిక. సిరుని సినీ కార్పొరేషన్‌ నిర్మించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ రిలీజ్‌ చేయనుంది. ఈ నెల 27న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య చెప్పిన విశేషాలు.

∙ సమంతకు రాహుల్‌ రవీంద్రన్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌. వాళ్లిద్దరు ఓ సినిమా కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే మా ఇద్దరికీ రాహుల్‌ కథ వినిపించాడు. నచ్చింది. సినిమా కంప్లీట్‌ అయ్యాక చూపించాడు. డైరెక్టర్‌గా తనకిది ఫస్ట్‌ సినిమా అనిపించలేదు. చాలా బాగా తీశాడు. నాకు బాగా నచ్చింది. వెంటనే నాన్నని (నాగార్జున) కూడా చూడమని చెప్పాను. సినిమాను మా బ్యానర్‌ నుంచి రిలీజ్‌ చేయాలనుకున్నాను.

∙సుశాంత్‌ నటించిన ‘ఆటాడుకుందాం రా’లో నేను గెస్ట్‌గా కనిపించా. ఇప్పుడు ఈ ‘చి ల సౌ’ రిలీజ్‌ చేస్తున్నాం. ఇది అనుకోకుండా జరిగింది. ప్లాన్‌ చేసి చేసింది కాదు.  ఈ సినిమాని 32 డేస్‌లో షూట్‌ చేశారు. ‘చి ల సౌ’ సినిమా హిట్‌ అయితే ఇక యాక్టింగ్‌ మానేస్తాను అన్నాడు రాహుల్‌ రవీంద్రన్‌ (నవ్వుతూ). 

ప్రస్తుతం చేస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో నా క్యారెక్టరైజేషన్‌ ‘అల్లరి అల్లుడు’లో నాన్నగారి క్యారెక్టర్‌లాగా  ఉంటుంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ‘సవ్యసాచి’ సినిమాలో ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయి. మంచి స్క్రిప్ట్స్‌ పడటంతో ఈ రెండు ప్రాజెక్ట్స్‌ వెంట వెంటనే చేశాను. ఫైనల్‌ కట్‌ చూసి, రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేస్తాం. తర్వాత వెంకటేశ్‌గారితో బాబీ డైరెక్షన్‌లో ‘వెంకీ మామా’ అనే సినిమా చేస్తున్నాను. ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణతో ఓ లవ్‌ స్టోరీ చేస్తున్నాను. అందులో సమంత, నేను మ్యారీడ్‌ కపుల్‌గానే కనిపిస్తాం. పెళ్లి తర్వాత జరిగే కథ అది. ఇప్పుడు కూడా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటే బావుండదేమో (నవ్వుతూ). 

నా ప్రతి సినిమాను నాన్నగారు చూసి హానెస్ట్‌గా చెబుతారు. ఆయన ఒపీనియన్‌ తీసుకొని టీమ్‌ అంతా డిస్కస్‌ చేసుకొని,  రీషూట్స్‌ కూడా చేస్తాం. సమంత ఇంకా పర్టిక్యులర్‌గా ఉంటుంది. స్టిల్, పోస్టర్‌ ప్రతిదాని గురించి మాట్లాడుతుంది. ఎంత బాగా విమర్శిస్తుందో అంతే గొప్పగా పొగుడుతుంది.  సీనియర్‌ డైరెక్టర్స్‌ కంటే యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌తో ఈజీగా మూవ్‌ అవ్వొచ్చు. యంగ్‌ డైరెక్టర్స్‌ అయితే సేమ్‌ ఏజ్‌ గ్రూప్‌ కాబట్టి ఐడియాస్‌ షేర్‌ చేసుకోవడం బావుంటుందని అనుకుంటాను. 

∙అన్నపూర్ణ బ్యానర్‌లో ప్రొడ్యూస్‌ అయ్యే అన్ని సినిమాల స్క్రిప్ట్స్‌ వింటాను.  యాక్చువల్లీ ‘ఒక లైలా కోసం’ సినిమా దగ్గరి నుంచే నేను ప్రొడక్షన్‌ చూసుకోవడం స్టార్ట్‌ చేశాను. ఫిల్మ్‌ స్కూల్‌వైపు ఎక్కువగా వెళ్లను కానీ అప్పుడప్పుడు ఇంటరాక్ట్‌ అవుతా.

∙‘మహానటి’లో 30 సెకన్లు అన్నారు కాబట్టి, ఆ సినిమా చేశాను. కానీ తాతగారి బయోపిక్‌లో నటించడం చాలా కష్టం. అయితే తాతగారి బయోపిక్‌ చూడాలని అనుకుంటున్నాను. 

సమంత సినిమాలు మానదు
పెళ్లయ్యాక మీరు, సమంత న్యూయార్క్‌ వెళ్లారు. సమంత సినిమాలు మానేస్తారనే టాక్‌ ఉంది? అనే ప్రశ్నలకు – ‘‘ఏ మాయ చేసావె’ షూటింగ్‌ న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌లో జరిగింది. మళ్లీ అక్కడికి వెళ్లాలని మా పెళ్లి జరగక ముందే డిసైడ్‌ అయ్యాం. అలాగే వెళ్లాం. సమంత సినిమాలు మానదు. ఒకవేళ కావాలంటే బ్రేక్‌ తీసుకుంటుంది. మళ్లీ సినిమాలు చేస్తుంటుంది. ప్రస్తుతం కథలు వింటోంది’’ అన్నారు నాగచైతన్య. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top