అదిరిపోయింది! | Sonakshi Sinha dances with Rajini in RFC | Sakshi
Sakshi News home page

అదిరిపోయింది!

Oct 27 2014 11:56 PM | Updated on Sep 2 2017 3:28 PM

అదిరిపోయింది!

అదిరిపోయింది!

సూపర్‌స్టార్ సూపర్ స్టయిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయి కన్నులతో ‘లింగ’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. చిత్రీకరణ నుంచే అంచనాలు అంబరాన్ని

 సూపర్‌స్టార్ సూపర్ స్టయిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయి కన్నులతో ‘లింగ’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. చిత్రీకరణ నుంచే అంచనాలు అంబరాన్ని తాకిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్‌తో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
 
 ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి ‘రాక్‌లైన్’ వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నాను అనే ఫీలింగే చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. రజనీ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, నరసింహా చిత్రాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ‘లింగ’ ఫస్ట్‌లుక్‌ని వినాయకచవితి కానుకగా విడుదల చేశాం. దీపావళి కానుకగా మరో లుక్ విడుదల చేశాం. స్పందన అదిరిపోయింది. ఇటీవలే హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో మూడున్నర కోట్ల భారీ వ్యయంతో రజనీ, సోనాక్షి, 200 మంది డాన్సర్లతో ఓ పాట చిత్రీకరించాం.
 
 సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్లో విజిల్స్ వేసేలా ఈ పాట ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్, మోకా, అబుదాబీల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అబ్రాడ్‌లోనే కొన్ని సాంగ్స్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నాం. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్. దేశంలోని ఉన్నతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రం పాటలను నవంబర్ రెండో వారం విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement