మాకు పనీపాటా లేక కాదు..! | Soha Ali Khan to turn producer with a biopic | Sakshi
Sakshi News home page

మాకు పనీపాటా లేక కాదు..!

Sep 19 2016 12:22 AM | Updated on Sep 4 2017 2:01 PM

మాకు పనీపాటా లేక కాదు..!

మాకు పనీపాటా లేక కాదు..!

బాలీవుడ్ కథానాయికలు ఇప్పుడు నిర్మాతలుగా మారడం ఓ ట్రెండ్ అయింది. ఇప్పటికే దియా మీర్జా, ప్రియాంకా చోప్రా,

 బాలీవుడ్ కథానాయికలు ఇప్పుడు నిర్మాతలుగా మారడం ఓ ట్రెండ్ అయింది. ఇప్పటికే దియా మీర్జా, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ వంటి తారలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వీళ్ల లిస్ట్‌లో సోహా అలీఖాన్ కూడా చేరారు. తన భర్త కునాల్ ఖేమూతో కలిసి ఆమె సినిమాలు నిర్మించనున్నారు. తొలి ప్రయత్నంగా ఓ లివింగ్ లెజెండ్ జీవితం ఆధారంగా సినిమా నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు.

ఆ లెజెండ్ సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ‘‘మాకు పనీపాటా లేకపోవడం వల్ల నిర్మాతలుగా మారలేదు. మేం నిర్మించే సినిమాల్లో మేం నటించం. కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలనే సంకల్పంతోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాం’’ అని సోహా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement