పెట్స్ ..అకౌంట్స్‌

Social Media Accounts For Celebrity Pets More Followers - Sakshi

సిటీలో క్రేజీగా సోషల్‌ ‘పెట్‌’ వర్కింగ్‌  

మార్జాలాలు, శునకాల వంటి పెట్స్‌కీ ఇన్‌స్టా అకౌంట్స్‌

కొన్ని పెట్స్‌కి ఓనర్స్‌ కంటే ఎక్కువ ఫాలోవర్స్‌

సిటీలో పెట్స్‌ క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే మనలాగే పెట్స్‌కు కూడా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ పెరుగుతుండటం చెప్పుకోదగిన విశేషం. దీంతో అత్యధిక సంఖ్యలో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెట్స్‌ చేసే సందడిని సోషల్‌ మీడియా పేజ్‌లో అప్‌డేట్‌ చేసి ఇతరులతో పంచుకోవడం.. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్‌ పెట్టడంతో రెండు వైపుల వారు హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. దీంతో రోజురోజుకీ పేజ్‌లకు క్రేజ్‌ పెరుగుతోంది. 

సాక్షి, కాలేజ్‌ కరస్పాండెంట్‌: ఎక్కువ మంది నగరానికి చెందిన టీనేజర్లు పెట్స్‌ కోసం ప్రత్యేక అకౌంట్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ట్రెండ్‌ చూసి  పెట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో ఒక పేజ్‌ స్టార్ట్‌ చేశారు. ఆ పేజ్‌ మీద అందరి పెట్స్‌ని పోస్ట్‌ చేసి అత్యధిక లైక్స్‌ వచ్చిన పెట్‌ని విజేతగా నిర్ణయించే తరహా పోటీలు, విజేతలకు పెడిగ్రీన్‌ వంటి డాగ్‌ఫుడ్‌ నుంచి పెట్స్‌కి అవసరమైన మరెన్నో బహుమతులు ఇస్తామనే ప్రకటనలూ పెరిగాయి. 

సెలబ్రిటీలే స్ఫూర్తి..
చాలామంది సెలబ్రిటీలీ పెట్‌ వర్కింగ్‌కి ఊపునిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పెట్‌ డయానా చోప్రాకి ఇన్‌స్ట్రాగామ్‌లో 1.49లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. టాలీవుడ్‌ స్టార్‌ సమంత అక్కినేనికి కూడా ఒక పెట్‌ అకౌంట్‌ ఉంది. ముంబైకి చెందిన మాన్సి తల్వార్‌ బీగిల్స్, మేనార్డ్, క్లో... పెట్స్‌ పేజ్‌కు 24వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. నగరానికి చెందిన సోషల్‌ మీడియా సెలబ్రిటీ, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దీప్తి సునయన తన పెట్‌ టొమ్మీ కోసం ఏర్పాటు చేసిన ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌కు 3,865 ఫాలోవర్స్‌ ఉన్నారు. టంగ్‌ ఔట్‌ ట్యూజ్‌ డేస్, హెడ్‌ టిట్‌ థర్స్‌డేస్, స్నగ్‌ విత్‌ పగ్‌... వంటి పేర్లతో సిటీలోని పెట్స్‌ ఫొటోలు, వీడియోలు కనువిందు చేస్తున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా షూట్స్‌ కూడా పెట్టుకుంటున్న పెట్‌ ఓనర్స్‌ వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతున్నారు.  

బడ్‌ని నేను బాగా ట్రైన్‌ చేశా.
చాలా మందికి పెట్స్‌ అంటే ఇష్టం ఉంటుంది. కానీ రకరకాల కారణాల వల్ల వాళ్లు వాటిని పెంచలేకపోతుంటారు. అలాంటివారికి బడ్‌ లేదా సింబాతో నా అనుభవాలు షేర్‌ చేసుకోవడం నాకు నచ్చుతుంది. పెట్స్‌ మనల్ని నవ్వుల్లో ముంచుతాయి. హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు జీవితం సంక్లిష్టమైంది కాదని నేర్పుతాయి. వీటివల్ల ప్రతి పరిస్థితిని చాలా ఈజీగా డీల్‌ చేయగలుగుతాం. తాజాగా మా కొత్త పప్‌ సింబాకు చాలా లైక్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం నాకు ఒక డాగ్, ఒక పిల్లి ఉన్నాయి. ఓ నెల తర్వాత రెండు పిల్లులు, ఒక డాగ్‌. సో.. ఈ అకౌంట్‌ ఒక్కరిది కాదు.. నాతో జీవించే మూగప్రాణులన్నింటిదీ. – ఆయుషి

నా పెట్‌కి గుర్తింపు కావాలని..

ఇట్స్‌ మీ టామీ.. అనే నా పెట్‌ పేజ్‌కి భలే క్యూట్‌ కామెంట్స్‌ వస్తుంటాయి. నా పెట్‌కి ఒక గుర్తింపు రావాలని, దానితో నా జ్ఞాపకాలన్నీ మిగిలిన వారితో షేర్‌ చేసుకోవాలని ఇది స్టార్ట్‌ చేశా. టామీ నా మీదకు జంప్‌ చేయడం, నాతో ఫైట్‌ చేయడం.. నేను కొన్ని నిమిషాలు కనపడకపోతే వెతుక్కోవడం.. వంటి చేష్టలన్నీ నేను రికార్డ్‌ చేస్తుంటాను. నా ఫ్రెండ్స్‌ బంధువులు అందరికీ పెట్స్‌తో నా ఫీట్స్‌ చూడటం చాలా ఇష్టం.
– ప్రణవి, కాలేజ్‌ స్టూడెంట్‌

ఫ్రెండ్స్‌ లైక్‌ చేసే పెట్‌ నాది..
నా పెట్‌ జ్యూస్‌ ఇంటికి వచ్చే ఫ్రెండ్స్‌కి జ్యూస్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిపోయింది. దాంతో దాని ఫొటోస్‌ పంపమని దాని గురించిన రోజువారీ విశేషాలు చెప్పమంటున్నారు. అందుకే ఈ ఆలోచన వచ్చి అకౌంట్‌ స్టార్ట్‌ చేశా. దీని ద్వారా దాని గురించి తెలుసుకోవడంతో పాటు మాట్లాడుకోవడానికి కూడా వారికి కుదురుతోంది. అంతేకాకుండా అది ఎదుగుతున్న తీరు, దాని చేష్టల్లో మార్పు చేర్పులు.. వీటన్నింటికీ ఒక కేటలాగ్‌ నాకు తయారవుతోంది కూడా. మంచం మీద నన్ను చుట్టుకుని పడుకుని ఉండే పోస్ట్‌ నా ఫేవరెట్‌. – విశ్వజోషి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top