రౌడీకి జోడీ | Sobhita Dhulipala joins with Dulquer Salmaan in true-crime film | Sakshi
Sakshi News home page

రౌడీకి జోడీ

Sep 20 2019 12:30 AM | Updated on Sep 20 2019 12:30 AM

Sobhita Dhulipala joins with Dulquer Salmaan in true-crime film - Sakshi

శోభితా ధూళిపాళ, లొకేషన్లో శోభిత

దుల్కర్‌ సల్మాన్‌ ఓ పెద్ద క్రిమినల్‌గా మారబోతున్నారు. తనకు పార్టనర్‌గా శోభితా ధూళిపాళ రెడీ అయ్యారు. ఇదంతా మలయాళ సినిమా ‘కురుప్‌’ కోసమే. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్‌ సుకుమార కురుప్‌. అతని జీవితం ఆధారంగా ‘కురుప్‌’ తెరకెక్కుతోంది. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకుడు. సుకుమార కురుప్‌ పాత్రలో దుల్కర్‌ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.  ఇందులో హీరోయిన్‌గా శోభితా కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయింది. శోభితకి ఇది రెండో మలయాళ సినిమా. నివీన్‌ పౌలీతో శోభిత చేసిన ‘మూతాన్‌’ రిలీజ్‌కు రెడీ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement