ధరణీధరన్ దర్శకత్వంలో శిరీష్ | sirish in Direction Dharanidharan | Sakshi
Sakshi News home page

ధరణీధరన్ దర్శకత్వంలో శిరీష్

Oct 18 2016 2:47 AM | Updated on Sep 4 2017 5:30 PM

ధరణీధరన్ దర్శకత్వంలో శిరీష్

ధరణీధరన్ దర్శకత్వంలో శిరీష్

మంచి సక్సెస్‌ఫుల్ దర్శక నటుల కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కనుందంటే కచ్చితంగా ఆ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటాయి.

 మంచి సక్సెస్‌ఫుల్ దర్శక నటుల కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కనుందంటే కచ్చితంగా ఆ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటాయి. అలాంటి ఒక చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల చిన్న చిత్రంగా రూపొంది మంచి విజయాన్ని అందుకున్న చిత్రం జాక్సన్‌దురై. ఈ చిత్రానికి దర్శకుడు ధరణీధర న్. ఈయన తాజా చిత్రానికి రెడీ అయ్యారు. అదే విధంగా ఇటీవల అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మరో చిత్రం మెట్రో. ఇందులో కథానాయకుడు శిరీష్. ఈయన తాజా చిత్రాన్ని ధరణీధరన్ దర్శకత్వంలో నటించనున్నారు.
 
  ఈ యూత్ కాంబినేషన్‌కు క్రేజీ సంగీత దర్శకుడు తోడైతే ఆ చిత్రానికి వ్యాపార వర్గాల్లోనూ అంచనాలు నెలకొంటాయి. ఎస్‌ఈ వినూత్న కథా చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీత బాణీలను అందించనున్నారు. దర్శకుడు కథ చెప్పగానే మరోమాట లేకుండా తానీ చిత్రాన్ని చేస్తున్నానని యువన్ అన్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. అన్నట్లు ఈ చిత్రాన్ని నిర్మాత శక్తి వాసన్ బర్మా టాకీస్ సంస్థతో కలిసి నిర్మించనున్నారు. చిత్ర రికార్డింగ్ కార్యక్రమాలు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయని షూటింగ్‌ను నవంబర్ చివరి వారంలో గానీ, డిసెంబర్ తొలివారంలో గానీ ప్రారంభించనున్నట్లు నిర్మాతల వర్గం తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement