నాగశౌర్యకు జోడీగా సిమ్రాన్‌..? | Simran Pareenja In Naga shouryas Nartanasala | Sakshi
Sakshi News home page

Mar 11 2018 3:22 PM | Updated on Mar 11 2018 3:22 PM

Simran Pareenja In Naga shouryas Nartanasala - Sakshi

నాగశౌర్య, సిమ్రాన్‌ పరీన్జా

ఛలో సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్‌ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనివాస్‌ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నిఖిల్‌ కిరాక్‌ పార్టీ ఫేం సిమ్రాన్‌ పరీన్జాను ఫైనల్‌ చేశారట. హిందీ సీరియల్స్‌తో పాపులర్‌ అయిన సిమ్రాన్‌.. కిరాక్‌‌ పార్టీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నాగశౌర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం త్వరలో రిలీజ్‌ అవుతుండగా మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement