వెయ్యి కోట్లున్నాయి | Simbu Says I Have 1000 Crores | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్లున్నాయి

Jun 7 2018 12:49 AM | Updated on Oct 2 2018 3:08 PM

Simbu Says I Have 1000 Crores - Sakshi

శింబు

షూటింగ్‌కి టైమ్‌కి రాడు. శింబుతో సినిమా అంటే అనుకున్న టైమ్‌కి కంప్లీట్‌ అవ్వదు. ఇలాంటి కామెంట్స్‌ వినిపిస్తుంటాయి శింబుతో వర్క్‌  చేసిన దర్శక – నిర్మాతల దగ్గరి నుంచి. ‘‘నా మీద ఉన్న ఈ నెగటీవ్‌ కామెంట్స్‌ అన్నింటినీ చెరిపేసుకుంటాను. ప్రస్తుతం దాని మీదే వర్కౌట్‌ చేస్తున్నాను’’ అన్నారు శింబు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘హీరోగా నా తొలి సినిమాని మా నాన్న (టి. రాజేందర్‌)గారితో చేసినప్పుడు షూటింగ్‌కి పది గంటలకు వెళ్లేవాణ్ని. అలాగని నాకెవరన్నా లెక్కలేదని కాదు.

మా నాన్నే కదా అని గ్రాంటెడ్‌గా తీసుకున్నట్లూ కాదు. అది నా లైఫ్‌ స్టైల్‌. నేను చాలా గారంగా పెరిగాను. చిన్నప్పటి నుంచి కంఫర్టబుల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తూ వచ్చాను. నాకు వెయ్యి కోట్లు పైగా ఆస్తులున్నాయి. వాటితో విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు. కానీ నాకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. సినిమా ఒక్కటే తెలుసు. వేరే వాళ్లను ఇబ్బంది పెట్టాలని, హర్ట్‌ చేయాలనీ నాకెప్పుడూ లేదు. నా మీద ఉన్న బ్యాడ్‌ కామెంట్స్‌ అన్నీ క్లియర్‌ చేసే దిశగా వర్క్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు శింబు. అంటే.. శింబు ఇక టైమ్‌కి షూటింగ్‌కి ఎటెండ్‌ అవుతారా? టైమే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement