కెప్టెన్‌ షేర్షా | Siddharth Malhotra & Kiara Advani in Kargil martyr Vikram Batra's biopic | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ షేర్షా

May 3 2019 1:37 AM | Updated on May 3 2019 1:37 AM

Siddharth Malhotra & Kiara Advani in Kargil martyr Vikram Batra's biopic - Sakshi

సిద్ధార్థ్‌ మల్హోత్రా

దేశ సరిహద్దులో శత్రువుల అంతు చూస్తానంటున్నారు బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా. ఇందుకోసం గన్‌ ఫైరింగ్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కనున్న నెక్ట్స్‌ చిత్రానికి ‘షేర్షా’ అనే టైటిల్‌ ఖరారైంది. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్‌ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్‌. విక్రమ్‌ను పాకిస్తాన్‌ ఆర్మీ ‘షేర్షా’ అని పిలిచేవారట.

అందుకే ఈ బయోపిక్‌కు ఆ టైటిల్‌ పెట్టారని ఊహించవచ్చు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్‌ దర్శకత్వం వహిస్తారు. కియారా అద్వానీ ఇందులో కథానాయికగా నటిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రియల్‌ లైఫ్‌ హీరో విక్రమ్‌ బత్రా పాత్రలో నటించబోతున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉన్నాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అన్నారు సిద్ధార్థ్‌. కరణ్‌ జోహార్, హిరూ జోహార్, అపూర్వా మెహతా, షబ్బీర్‌ బాక్స్‌వాలా, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement