పెళ్లి కూతురి డైలమా | Shubhalekha+Lu first song release | Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురి డైలమా

Aug 5 2018 1:17 AM | Updated on Aug 28 2018 4:32 PM

Shubhalekha+Lu first song release - Sakshi

సాధారణంగా కాబోయే పెళ్లి కూతురు శుభలేఖలను చూసినప్పుడు ఊహల్లో తేలిపోవడమో, చుట్టూ నలుగురూ ఉంటే సిగ్గు పడటమో.. సీన్‌ ఇలా ఉంటుంది. కానీ ఒక చేతిలో శుభలేఖను పట్టుకుని మరో చేతితో సిగరెట్‌ పట్టుకుని కాబోయే పెళ్లి కూతురు ఏదో ఆలోచిస్తుంటే మాత్రం ఎక్కడో తేడా ఉన్నట్లే. ‘శుభలేఖ+లు’ సినిమా టీజర్‌లో పెళ్లి కూతురు ఇలానే కనిపిస్తుంది. శ్రీనివాస సాయి, దీక్షా శర్మ జంటగా శరత్‌ నర్వాడే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సి. విద్యాసాగర్, ఆర్‌. ఆర్‌. జనార్థన్‌ నిర్మించారు.


ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ‘‘వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. కానీ పెళ్లికి ముందు ఎలాంటి విషయాలనూ దాచకూడదని నేటి తరం యువత అభిప్రాయపడుతున్నారు. ఫలితం ఎలా ఉన్నా స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెలలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు కేఎమ్‌ రాధాకృష్ణన్‌ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement