హ్యాపీ మూమెంట్లో నీతో లేను.. సారీ! | Shruti Haasan birthday wishes to Michael Corsale | Sakshi
Sakshi News home page

హ్యాపీ మూమెంట్లో నీతో లేను.. సారీ!

Feb 18 2018 9:54 AM | Updated on Feb 18 2018 12:31 PM

Shruti Haasan birthday wishes to Michael Corsale - Sakshi

మైఖెల్‌ కోర్సల్‌తో నటి శ్రుతీహాసన్‌ (ట్వీటర్ ఫొటో)

సాక్షి, చెన్నై: లండన్‌కు చెందిన నటుడు, తన బాయ్ ఫ్రెండ్ మైఖెల్‌ కోర్సల్‌తో నటి శ్రుతీహాసన్‌ గత కొంతకాలం నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నటి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను లాస్‌ఏంజల్స్‌లో మైఖెల్‌ కోర్సల్‌, కొందరు స్నేహితులతో జరుపుకుని అందరిని ఆశ్చర్యపరచారు. కోర్సల్ అంటే తనకెంత ఇష్టమో శ్రుతీహాసన్‌ చెప్పకనే చెప్పేశారు. మైఖెల్ కోర్సల్‌ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపింది శ్రుతి.

‘ మై బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ ఇన్ క్రైమ్, నాతో పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇష్టపడే తోటి ప్రయాణికుడు. ప్రతి విషయంలోనూ నాతో పాటు నవ్వుతుండే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే’  అంటూ శ్రుతీహాసన్‌ ట్వీట్ చేశారు. ఈ సంతోష సందర్భంలో నీ చెంత లేనందుకు క్షమించమంటూ బాయ్ ఫ్రెండ్ కోర్సల్‌ను నటి కోరుతున్నట్లు తెలిపింది. ఫన్నియెస్ట్ మ్యాన్ ఐ నో, హార్ట్ ఆఫ్ గోల్డ్, బర్త్‌డే బాయ్, సారీ ఐయామ్ నాట్ దేర్, హ్యాపీమీ హ్యాపీఅస్ అని హ్యాష్ ట్యాగ్స్‌తో మైఖెల్ కోర్సల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది ఈ బ్యూటీ. కొన్ని రోజుల కిందట చెన్నైలో జరిగిన నటుడు ఆదవ్‌ కన్నదాసన్‌ పెళ్లి వేడుకలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సందడి చేయగా.. పెళ్లి వందంతులు వ్యాప్తిచెందాయి. తాను ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం లేదని శ్రుతీహసన్‌ స్పష్టం చేసి రూమర్లకు చెక్ పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement