
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా దూసుకుపోతూ.. కాసింత విరామం దొరికినా ఫ్యామిలీతో గడుపుతూ.. ఫ్యామిలీ మ్యాన్‌గానూ మంచి మార్కులు సంపాదించారు మహేష్ బాబు. ఫ్యామిలీతో సరదాగా మహేష్ గడుపుతూ ఉంటే.. ఆయన ఫ్యాన్స్‌కు అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారు నమత్రా శిరోద్కర్.
వీరిద్దరి ప్రేమ వివాహానికి నేటితో పద్నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను శ్రుతీహాసన్ షేర్ చేస్తూ.. ఫోటో బాగుంది, అందమైన జంట అంటూ ట్వీట్ చేశారు. మహేష్-శ్రుతీహాసన్‌కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Such a beautiful photograph and such a beautiful couple !
— shruti haasan (@shrutihaasan) February 10, 2019