పెళ్లి తర్వాత ఫస్ట్‌ సినిమా

Shriya saran and Niharika Movie Launched by Varun Tej and Krish - Sakshi

‘కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు జ్ఞానశేఖర్‌. మొదటిసారి ఆయన నిర్మాతగా మారారు. శ్రియ శరణ్‌ , నీహారిక కొణిదెల ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రమేష్‌ కరుతూరితో కలిసి జ్ఞానశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తొలి సన్నివేశానికి హీరో వరుణ్‌ తేజ్‌ క్లాప్‌ ఇవ్వగా, డైరెక్టర్‌ క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కమర్షియల్‌ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు చిత్రబృందం. పెళ్లి తర్వాత శ్రియ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top