మాధవన్‌తో మరోసారి..

shraddha srinath Romace Again With Madhavan - Sakshi

తమిళసినిమా: నటి శ్రద్ధా శ్రీనాథ్‌ నటుడు మాధవన్‌తో మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. కన్నడ చిత్రం యూ టర్న్‌తో పాపులర్‌ అయిన ఈ కన్నడ భామ కోలీవుడ్‌కు విక్రమ్‌ వేదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నటుడు మాధవన్‌కు జంటగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత రిచ్చి అనే ఒక తమిళ చిత్రంలోనే నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ మాతృభాషలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. అంతే కాదు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. కాగా తాజాగా కోలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న మాధవన్‌కు జంటగా మరోసారి నటించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి మార అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు దిలీప్‌కుమార్‌ పరిచయం కానున్నారు.

ఈయన ఇంతకు ముందు కల్కీ అనే లఘు చిత్రాన్ని రూపొందించారన్నది గమనార్హం. త్వరలో కథనాన్ని బిపిన్, మాటలను నీలం అందిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అరిందుమ్‌ అరియామలుమ్, పట్టియల్‌ చిత్రాలకు దర్శకుడు విష్ణువర్ధన్‌ వద్ద పనిచేశారు. అదేవిధంగా తాజాగా సమంత నాయకిగా నటిస్తున్న సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో ఆమె పాత్రకు మాటలను రాశారు. మాధవన్, శ్రద్ధాశ్రీనా«థ్‌ జంటగా నటించనున్న తాజా చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావలసి ఉంది. సాధారణంగా కథలో కొత్తదనం లేకుంటే నటుడు మాధవన్‌ నటించడానికి అంగీకరించరు. మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్‌ల జంటతో మరోసారి హిట్‌ కొట్టడానికి రెడీ అవుతున్నారన్న మాట. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top