
తమిళ నటుడు విష్ణు విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం ఆర్యన్.. ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులను హీరో నితిన్ తండ్రి, ప్రముఖ పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి పొందారు.
ఆర్యన్ సినిమాలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు సెల్వరాఘవన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం జిబ్రాన్ అందించగా.. విష్ణు విశాల్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఒక సీరియల్ కిల్లర్ కోసం పోలీసులు వేస్తున్న ప్లాన్‌లు ఎలా ఉంటాయో చూపించారు. వాటి నుంచి ఆ కిల్లర్ ఏ విధంగా తప్పించుకుంటున్నాడో చెప్పారు. చాలా ఆసక్తిగా ఆర్యన్ ట్రైలర్ ఉంది.