నంబర్‌ 3 | Shraddha Kapoor is third most-followed Bollywood actor on Instagram | Sakshi
Sakshi News home page

నంబర్‌ 3

Jul 13 2020 1:59 AM | Updated on Jul 13 2020 1:59 AM

Shraddha Kapoor is third most-followed Bollywood actor on Instagram - Sakshi

శ్రద్ధా కపూర్

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్‌ ఒకరు. ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేస్తుండటం, తన అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్‌ చేయడం వంటి వాటితో శ్రద్ధా కపూర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. అంత యాక్టివ్‌గా ఉంటారు కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల (ఐదు కోట్లు) ఫాలోయర్స్‌ను సంపాదించుకోగలిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల ఫాలోయర్స్‌ మైలురాయిని చేరుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారీ బ్యూటీ. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ల తర్వాత అత్యధిక ఫాలోయర్లను సాధించిన మూడో హీరోయిన్‌ శ్రద్ధా కపూరే కావడం విశేషం.

దాదాపు 47.8 మిలియన్ల ఫాలోయర్స్‌తో ఆలియా భట్‌ కూడా యాభై మిలియన్ల జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో వారసులపై పలువురు మండిపడుతున్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేశ్‌ భట్‌ కుమార్తెగా ఆలియా కూడా చాలామంది ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది ‘అన్‌ఫాలో’ అయ్యారు. అలా ఫాలోయర్ల సంఖ్య ఆమెకు తగ్గుతూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement