నాతో ఆయన చాలా చెప్పారు | Shimbu Said a lot of Tips | Sakshi
Sakshi News home page

నాతో ఆయన చాలా చెప్పారు

Jul 25 2016 1:38 AM | Updated on Sep 4 2017 6:04 AM

నాతో ఆయన చాలా చెప్పారు

నాతో ఆయన చాలా చెప్పారు

శింబు చాలా టిప్స్ చెప్పారని అంటోంది నటి మంజిమామోహన్. ఇటీవల కోలీవుడ్‌కు దిగుమతి అయిన మాలీవుడ్ బ్యూటీ ఆ అమ్మడు.

శింబు చాలా టిప్స్ చెప్పారని అంటోంది నటి మంజిమామోహన్. ఇటీవల కోలీవుడ్‌కు దిగుమతి అయిన మాలీవుడ్ బ్యూటీ ఆ అమ్మడు. అంతే కాదు ఒకే దెబ్బకు రెండు కాయలు అన్న సామెత మాదిరి ఒకే చిత్రంతో తమిళం, తెలుగు భాషల్లో పరిచయం అవుతోంది. అలాగే ఇద్దరు ప్రముఖ యువ హీరోలతో ఏకకాలంలో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను కొట్టేసిన నటి మంజిమామోహన్. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని కొద్దిలో మిస్ అయిన ఈ బ్యూటీ దాన్ని చాలా ఈజీగా తీసుకుంది. శింబుతో అచ్చంమంబదు మడమయడా చిత్రంలో నటించిన మంజిమాతో చిన్న భేటీ..
 
ప్ర: మీ గురించి చెప్పండి?
: నేను బాలతారగానే చిత్ర రంగప్రవేశం చేశాను. అలా మల యాళంలో చాలా చిత్రాల్లో నటించి పలు అవార్డులను అందుకున్నాను. ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రం ద్వారా కథానాయకిగా పరి చయం అయ్యాను.  ఈ చిత్ర ట్రైలర్ చూసి దర్శకుడు గౌతమ్‌మీనన్  అచ్చంయంబదు మడమయడా చిత్రంలో అవకాశం ఇచ్చారు.
 
ప్రశ్న: ఈ చిత్రంలో మీ పాత్ర గురించి?
: నా పాత్ర గురించి ఇప్పుడు చెప్పలేను. అయినా చెబుతున్నాను. అచ్చంయంబదు మడమయడా చిత్రంలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అయినా మోడ్రన్‌గా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పను.
 
ప్ర: మలయాళంలో మీరు చాలా స్వీటీ అమ్మాయటగా మరి తమిళంలో?

: నాన్న నితిన్‌మీనన్ చాయాగ్రహకుడు.ఆయనతో చిన్నతనంలోనే షూటింగ్‌లకు వెళ్లేదానిని. అమ్మ డాన్సర్.మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్‌గోపి, దిలీప్ ఇలా అందరు హీరోలతోనూ పరిచయం ఉంది. వారందరితోనూ బాల నటిగా నటించాను. అందుకే అక్కడ నేను ముద్దుల అమ్మాయిని. కోలీవుడ్‌కు ఇప్పుడేగా పరిచయం అవుతున్నాను. కొంచెం సమయం పడుతుంది.
 
ప్ర: శింబుతో నటించిన అనుభవం?
: శింబు చాలా ప్రతిభావంతుడైన నటుడు.కెమెరా యాంగిల్స్ నుంచి లై ట్స్ వరకూ అన్ని తెలిసిన నటుడు. నాకు చాలా టిప్స్ చెప్పారు. శింబుతో నటించడం మంచి అనుభవం.అదే విధంగా నాగచైతన్యతో కూడా.
 
ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు?
: నటన విషయంలో నేనెలాంటి హద్దులు పెట్టుకోలేదు. చాలెంజింగ్ పాత్రలు చేయాలని ఆశపడుతున్నాను. తమిళ ప్రేక్షకులు ప్రతిభావంతులైన వారిని ఆదరిస్తారు. వారికి నచ్చే పాత్రల్లో నటించి మెప్పించాలని కోరుకుంటున్నాను.

ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రం?
: విక్రమ్‌ప్రభుకు జంటగా మడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తున్నాను. దీనికి ప్రభాకరన్ దర్శకుడు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.

ప్ర: సరే మంజిమా అంటే అర్థం?
: అది బెంగాళీ పదం.మంజిమా అంటే అందాలరాశి అని అర్థం
 
 

Advertisement
 
Advertisement
Advertisement