జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై | Shilpa Shetty welcomes Bappa! | Sakshi
Sakshi News home page

జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై

Sep 4 2016 11:25 PM | Updated on Sep 4 2017 12:18 PM

జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై

జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై

పండగ చేసుకోవడం అందరికీ ఇష్టమే. శిల్పా శెట్టిలాంటి వాళ్లకైతే మరీ మరీ ఇష్టం. ఒక్క పండగను కూడా ....

పండగ చేసుకోవడం అందరికీ ఇష్టమే. శిల్పా శెట్టిలాంటి వాళ్లకైతే మరీ మరీ ఇష్టం. ఒక్క పండగను కూడా మిస్సవకుండా వీలైనంత వైభవంగా జరుపుకుంటారామె. పండగ సమయాల్లో శిల్పా కట్టుకునే చీరలు, పెట్టుకునే నగలు, చేసుకునే హెయిర్ స్టైల్‌ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవని బాలీవుడ్ వాళ్లు అంటారు. డ్రెస్సింగ్ వరకేనా! పూజలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారామె.

పండగ ముందు రోజే అన్ని ఏర్పాట్లూ చేసేసుకుంటారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఆదివారమే గణేశుణ్ణి ఇంటికి తెచ్చేసుకున్నారు. శిల్పా, ఆమె భర్త రాజ్ కుంద్రా, నాలుగేళ్ల కొడుకు వియాన్ ముంబైలోని ఓ ఫేమస్ మార్కెట్‌కి వెళ్లి గణపతి ప్రతిమను కొన్నారు. జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై అంటూ ఎలుక వాహనుణ్ణి కారులో ఇంటికి తీసుకెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement