‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’ | Shilpa Shetty Shares hilarious Video from Her vacay | Sakshi
Sakshi News home page

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది: శిల్పా

Jul 24 2019 4:36 PM | Updated on Jul 24 2019 5:26 PM

Shilpa Shetty Shares hilarious Video from Her  vacay - Sakshi

ముంబై : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి తాజాగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. నా ‘మార్లిన్‌ మన్రో’ మూమెంట్‌ అంటూ బీచ్‌లో సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేగాక ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ కామెంట్‌ చేశారు. కాగా 1955లో విడుదలైన మన్రో ‘సెవెన్‌ ఇయర్‌ ఇట్చ్‌’ సినిమాలో ఓ మూమెంట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. ఆమె దుస్తులు పైకి ఎగురుతుంటే వెంటనే చేతులతో కిందకు లాక్కున్నారు. ఈ మన్రో మాదిరిగానే తనకూ అలాంటి అనుభవం ఎదురైందంటూ శిల్పా ఈ ఫన్నీ వీడియోను పంచుకున్నారు.

ఇక శిల్పాశెట్టి కుంద్రా ప్రస్తుతం గ్రీస్‌, లండన్‌లలో కుటుంబం కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. కాగా దిల్జిత్‌ దోసంజ్‌, యామీ గౌతమ్‌ నటిస్తున్న సినిమాతో శిల్పా బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.  ఈ సినిమాలో ఆమె రచయితగా కనిపించనున్నారు. సెలవుల నుంచి రాగానే ఆగష్టు మొదటి వారంలో  ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement