శిల్పాశెట్టి ఫొటో షేర్‌ చేసిన జాన్‌ సెనా

John Cena Shares Meme On Shilpa Shetty She Says Hilarious - Sakshi

డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ స్టార్‌ జాన్‌ సెనా క్రియేట్‌ చేసిన మీమ్‌ బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి అభిమానులను ఆకర్షిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూఈ అమెరికన్‌ స్టార్‌ స్టీవ్‌ ఆండర్సన్‌ ఫొటోను మార్ఫ్‌ చేసిన జాన్‌ సెనా.. అతడి శరీరానికి శిల్పా ముఖాన్ని అంటించాడు. ‘స్టోన్‌ కోల్డ్‌(స్టీవ్‌ ఆండర్సన్‌ స్టేజ్‌ నేమ్‌) శిల్పా శెట్టి కుంద్రా’ అంటూ ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ లైకులు సాధించిన ఈ ఫొటోపై స్పందించిన నెటిజన్లు.. ‘బాలీవుడ్‌.. డబ్ల్యూడబ్ల్యూఈ కలిస్తే ఇలాగే ఉంటుంది. కానీ శిల్పా నిన్నలా చూడలేకపోతున్నాం. నిజంగా జుట్టు ఊడిపోతే ఏంటీ సంగతి. భయంగా ఉంది. రెజ్లర్‌ కావాలని పొరపాటున ఆ పని చేయకు. ప్లీజ్‌’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక వైరల్‌గా మారిన తన ఫొటోపై స్పందించిన శిల్పా శెట్టి ‘ హిలేరియస్‌గా ఉంది.  అమ్మో ఇది మాత్రం రాకూడదు’ అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టా అకౌంట్‌లో జాన్‌ సెనా క్రియేట్‌ చేసిన ఫొటోను షేర్‌ చేశారు. కాగా వరల్డ్‌ చాంపియన్‌ అయిన జాన్‌ సెనా ప్రపంచకప్‌లో టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫొటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా తన ఫ్యాన్‌ అయిన విహాన్‌ కుంద్రా(శిల్పాశెట్టి కొడుకు)ను విష్‌ చేస్తూ వీడియో రూపొందించాడు. ఈ క్రమంలో.. ‘జాన్‌ సెనా అకౌంట్‌ను బహుశా భారతీయులు ఆపరేట్‌ చేస్తున్నారేమో. అందుకే ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి పోస్టులే కనిపిస్తున్నాయి’ అంటూ అతడి ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top