‘షేర్’ షురూ... | Share is ok... | Sakshi
Sakshi News home page

‘షేర్’ షురూ...

May 14 2014 10:34 PM | Updated on Sep 2 2017 7:21 AM

‘షేర్’ షురూ...

‘షేర్’ షురూ...

నందమూరి కల్యాణ్‌రామ్ ‘షేర్’గా సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లతో ‘కత్తి’ సినిమా వచ్చింది.

నందమూరి కల్యాణ్‌రామ్ ‘షేర్’గా సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లతో ‘కత్తి’ సినిమా వచ్చింది. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై కొమర వెంకటేశ్ నిర్మిస్తున్న ‘షేర్’ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని సాయిబాబా టెంపుల్‌లో జరిగాయి. సాయిబాబాపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి కల్యాణ్‌రామ్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సమర్పకురాలు బేబీ సాయి నీహారిక కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. కల్యాణ్‌రామ్ శారీరక భాషకు అనుగుణంగా ఇందులో ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది’’ అని చెప్పారు. ఏకధాటి చిత్రీకరణతో సినిమా పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్ రిషి, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డి. బ్రహ్మానందరావ్.
 

Advertisement
 
Advertisement
Advertisement