విక్రమ్‌ప్రభుతో షామిలి రొమాన్స్ | Shamli romance with vikramprabhu | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ప్రభుతో షామిలి రొమాన్స్

Aug 26 2015 5:02 AM | Updated on Sep 3 2017 8:07 AM

విక్రమ్‌ప్రభుతో షామిలి రొమాన్స్

విక్రమ్‌ప్రభుతో షామిలి రొమాన్స్

15 ఏళ్ల క్రితం నటబాల మేధావిగా ప్రశంసలు అందుకున్న షామిలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు...

15 ఏళ్ల క్రితం నట బాల మేధావిగా ప్రశంసలు అందుకున్న షామిలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్య నభ్యసించిన నటి షాలిని చెల్లలు. అజిత్ మరదలు షామిలి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. కారణం కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆమె తెరంగేట్రం విషయమై సమీప కాలంలో చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది.15 ఏళ్ల క్రితం నటించిన కండుకొండేన్ కండుకొండేన్ బాల నటిగా షామిలి చివరి చిత్రం. ఆ తరువాత ఆమె కోలీవుడ్‌లో నటించలేదు. అయితే కథానాయకిగా తెలుగులో ఓయ్ అనే చిత్రంతో పరిచయం అయ్యారు. హీరోయిన్‌గా షామిలి ఏకైక చిత్రం అదొక్కటే.

ఈ మధ్యనే అమెరికా నుంచి తిరిగొచ్చిన ఈ బ్యూటీ నటించడానికి రెడీ అనడంతో చాలా మంది తమిళ చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక తాజా సమాచారం ఏమిటంటే సక్సెస్ చిత్రాల యువ నటుడు, మహా నటుడు శివాజీగణేశన్ మనవడు, ప్రభు వారసుడు విక్రమ్‌ప్రభుతో జత కట్టడానికి షామిలి సిద్ధం అవుతున్నారన్నది. దీనికి వీరశివాజీ అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకు ముందు తగరారు చిత్రాన్ని తెరకెక్కించిన గణేశ్‌వినయన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని చేపట్టనున్నారు. కామెడీ,యాక్షన్ ప్రధానాంశాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి చాయాగ్రహణాన్ని సుకుమార్, కళాదర్శకత్వాన్ని ఇళయరాజా,కూర్పు బాధ్యతన్ని రూబెన్ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement