breaking news
Virasivaji
-
తెరపైకి షామిలి తొలిచిత్రం
నటి షామిలి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న వీరశివాజీ చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.కారణం నాయకిగా కోలీవుడ్లో ఆమె తొలి చిత్రం ఇదే కావడం. బాల నటిగా పలు భాషల్లో అనేక చిత్రాలు చేసిన బేబి షామిలి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాంటిది హీరోరుున్గా తొలుత తెలుగులో పరిచయమైనా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.దీంతో నటనకు కాస్త విరామం పలికి అమెరికా వెళ్లి సినిమాకు సంబంధించిన చదువు చదివి చెన్నైకి తిరిగొచ్చిన తరువాత నటించిన మొదటి చిత్రం వీరశివాజీ. విక్రమ్ప్రభు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఎస్.నందకుమార్ నిర్మించారు. జాన్విజయ్, రోబోశంకర్, యోగిబాబు, నాన్కడవుల్ రాజేంద్రన్, మనీషాశ్రీ,వినోదిని, దర్శకుడు మారిముత్తు, సాతన్య,కుట్టి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను గణేశ్ వినాయక్ నిర్వహించారు. చాలా రోజుల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉండగా, ఈ చిత్ర నిర్మాతే విశాల్, తమన్నా జంటగా కత్తిసండై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని విడుదల చేసి ఆ తరువాత వీరశివాజీని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. తాజాగా కత్తిసండై చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించాలని నిర్ణరుుంచిన యూనిట్ వర్గాలు ముందుగా విక్రమ్ప్రభు, వీరశివాజీ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ విధంగా వీరశివాజీ చిత్రం ఈ నెల 16న తెరపైకి రానుంది. -
విక్రమ్ప్రభుతో షామిలి రొమాన్స్
15 ఏళ్ల క్రితం నట బాల మేధావిగా ప్రశంసలు అందుకున్న షామిలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్య నభ్యసించిన నటి షాలిని చెల్లలు. అజిత్ మరదలు షామిలి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. కారణం కోలీవుడ్లో హీరోయిన్గా ఆమె తెరంగేట్రం విషయమై సమీప కాలంలో చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది.15 ఏళ్ల క్రితం నటించిన కండుకొండేన్ కండుకొండేన్ బాల నటిగా షామిలి చివరి చిత్రం. ఆ తరువాత ఆమె కోలీవుడ్లో నటించలేదు. అయితే కథానాయకిగా తెలుగులో ఓయ్ అనే చిత్రంతో పరిచయం అయ్యారు. హీరోయిన్గా షామిలి ఏకైక చిత్రం అదొక్కటే. ఈ మధ్యనే అమెరికా నుంచి తిరిగొచ్చిన ఈ బ్యూటీ నటించడానికి రెడీ అనడంతో చాలా మంది తమిళ చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక తాజా సమాచారం ఏమిటంటే సక్సెస్ చిత్రాల యువ నటుడు, మహా నటుడు శివాజీగణేశన్ మనవడు, ప్రభు వారసుడు విక్రమ్ప్రభుతో జత కట్టడానికి షామిలి సిద్ధం అవుతున్నారన్నది. దీనికి వీరశివాజీ అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకు ముందు తగరారు చిత్రాన్ని తెరకెక్కించిన గణేశ్వినయన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని చేపట్టనున్నారు. కామెడీ,యాక్షన్ ప్రధానాంశాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి చాయాగ్రహణాన్ని సుకుమార్, కళాదర్శకత్వాన్ని ఇళయరాజా,కూర్పు బాధ్యతన్ని రూబెన్ నిర్వహించనున్నారు.