‘అర్జున్‌ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్‌

Shalini Pandey is Being Introduced to Bollywood Opposite Aditya - Sakshi

2017లో రిలీజ్‌ అయిన అర్జున్‌ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా స్టార్‌ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్‌ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్‌గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం 100% లవ్‌ తమిళ రీమేక్‌తో పాటు కల్యాన్ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న 118 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఓ బాలీవుడ్‌ మూవీలోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్‌ నటుడు పరేష్ రావల్‌ తనయుడు ఆదిత్య హీరోగా తెరకెక్కుతున్న బాంఫాడ్ సినిమాలో షాలిని హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో రంజన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top