నవీన్ బ్లడ్‌లోనే నటన ఉంది! | Senior Naresh son debut film from | Sakshi
Sakshi News home page

నవీన్ బ్లడ్‌లోనే నటన ఉంది!

Jan 1 2015 11:00 PM | Updated on Sep 2 2017 7:04 PM

నవీన్ బ్లడ్‌లోనే నటన ఉంది!

నవీన్ బ్లడ్‌లోనే నటన ఉంది!

ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిత్రాలు విడుదలవుతాయి. ముందుగా నవీన్‌తో చేస్తున్న చిత్రం విడుదలవుతుంది.

 ‘‘ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిత్రాలు విడుదలవుతాయి. ముందుగా నవీన్‌తో చేస్తున్న చిత్రం విడుదలవుతుంది. ఎడిటింగ్ శాఖలో తన ప్రతిభను నిరూపించుకున్న నవీన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. అతని రక్తంలోనే నటన ఉంది. అలాగే, ఈ చిత్రదర్శకుడు రాంప్రసాద్ రౌతు చాలా ప్రతిభావంతుడు. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్‌తో మూడు పాటలు, కొంత భాగం టాకీ పూర్తయ్యాయి’’ అని చంటి అడ్డాల తెలిపారు.
 
 నటుడు నరేశ్ తనయుడు నవీన్‌ని పరిచయం చేస్తూ, అడ్డాల చంటి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అలనాటి నటి మేనక (‘పున్నమినాగు’ హీరోయిన్) కుమార్తె కీర్తి సురేశ్ పరిచయమవుతోంది. మరో నాయికగా చాందిని నటిస్తోంది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర చేస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికల గురించి అడ్డాల చంటి చెబుతూ -‘‘ఓ అగ్ర హీరోతో సినిమా చేయబోతున్నాను. లొకేషన్స్ కోసం వచ్చే నెల దక్షిణాఫ్రికా వెళతాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement