సీనియర్‌ నటుడు కన్నుమూత | Senior Actor Captain Raju Passed Away | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటుడు కన్నుమూత

Sep 17 2018 10:53 AM | Updated on Sep 17 2018 4:21 PM

Senior Actor Captain Raju Passed Away - Sakshi

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్‌ అలియాస్‌ ‘కెప్టెన్‌ రాజు’(68) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్‌ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్‌ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు.

1980ల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement