'సెల్ఫీ రాజా' రివ్యూ | 'Selfie Raja' review | Sakshi
Sakshi News home page

'సెల్ఫీ రాజా' రివ్యూ

Jul 15 2016 5:48 PM | Updated on Sep 4 2017 4:56 AM

సినిమాల్లో కాలం చెల్లని కాన్సెప్ట్ 'కామెడీ'. అలాంటి ఎవర్ గ్రీన్ ఎలిమెంట్ను నమ్ముకున్నాడు కాబట్టే అల్లరి నరేష్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు.

సినిమా : సెల్ఫీ రాజా
జానర్ : కామెడీ ఎంటర్టెయినర్
నటీనటులు : అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్నా సింగ్ రనావత్, కృష్ణ భగవాన్, రవిబాబు, పృధ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : ఎస్.లోకనాథన్
మాటలు : డైమండ్ రత్నం
నిర్మాత : చలసాని రామబ్రహ్మం చౌదరి
కథ, దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి


సినిమాల్లో కాలం చెల్లని కాన్సెప్ట్ 'కామెడీ'. అలాంటి ఎవర్ గ్రీన్ ఎలిమెంట్ను నమ్ముకున్నాడు కాబట్టే అల్లరి నరేష్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా అల్లరోడి సినిమాలన్నీ ఫట్ మంటుండటంతో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనకి బాగా అలవాటైనా 'స్పూఫ్' నే సేఫ్ గా భావించి ఈ శుక్రవారం 'సెల్ఫీ రాజా'ని ధియేటర్లలో దించాడు.  మరి సెల్ఫీ రాజా సందడేంటో చూద్దాం..

కథ :
రాజా (అల్లరి నరేష్)కి సెల్ఫీల పిచ్చి. దానికి తోడు నోటి దురుసు. తనకున్న ఈ స్పెషల్ ఎఫెక్టులతో తనతోపాటు తన చుట్టుపక్కల ఉన్నవాళ్లను కూడా ఇబ్బందుల్లో పడేస్తుంటాడు. అనుకోకుండా రాజాకు పోలీస్ కమీషనర్ కూతురు శ్వేత(సాక్షి చౌదరి)తో పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారి,  అదృష్టవశాత్తూ ఆ ప్రేమ.. పెళ్లికి దారి తీస్తుంది. అయితే మొదటి రాత్రే ఇద్దరి మధ్య అపార్థాలు చోటుచేసుకోవడంతో భార్య అతన్ని వదిలి వెళ్లిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను కాదని వెళ్లిపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు రాజా. వీలైనన్ని ప్రయత్నాలూ చేస్తాడు. వాటిలో ఒక్కటి కూడా ఫలించకపోవడంతో వినూత్న ఐడియాతో జీవితానికి వీడ్కోలు పలకాలని డిసైడ్ అవుతాడు.

ఎలాగైనా తనను హత్య చేయాలంటూ ప్రొఫెషనల్ కిల్లర్ మామ్స్(రవిబాబు)కి సుపారీ ఇచ్చేస్తాడు. పని మొదలుపెట్టాక పూర్తి చేయనిదే నిద్రపోని ఈ క్రేజీ కిల్లర్ రాజాని వెంటాడుతూ ఉంటాడు. ఈలోగా రాజాకి, అతని భార్యకి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి భార్యాభర్తలు ఒక్కటవుతారు. అంతటితో కథ సుఖాంతం అవుతుందనుకుంటే పొరపాటే. డబ్బు తీసుకున్నాక చంపి తీరాల్సిందేనంటూ కిల్లర్ మామ్స్.. భీమ్స్(అల్లరి నరేష్)తో కలిసి వేటని ముమ్మరం చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు హీరోలతో కన్ఫ్యూజన్ కామెడి షురూ అవుతుంది. అసలు రాజాకి, భీమ్స్ కి సంబంధం ఏమిటి? మామ్స్, భీమ్స్ కలిసి రాజాని చంపేస్తారా? ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే మిగిలిన కథ.

ఎవరెవరు ఎలా..

రెండు పాత్రల్లో కనిపించిన అల్లరి నరేష్ తనదైన కామెడీ స్టైల్తో ఆకట్టుకున్నాడు. జూ.ఎన్టీఆర్ మొదలుకుని పవన్ కల్యాణ్ వరకూ ఎవ్వరినీ వదల్లేదు. స్పూఫ్ లతో అల్లాడించాడు. ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ షోకే పరిమితమయ్యారు. రవిబాబు, కృష్ణ భగవాన్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, షకలక శంకర్, సుదర్శన్ లాంటి కామెడీ స్టార్లు తమ పాత్ర మేరకు నటించారు.

కమెడియన్లంతా కలసిమెలసి నటించినా కితకితలు కలిగింది తక్కువే అని చెప్పొచ్చు. లేటెస్ట్ ట్రెండ్ 'సెల్ఫీ'ని పేరులో వాడుకున్నా సినిమాలో అంతగా వాడలేదు. 'సెల్ఫీ రాజా' కంటే 'స్పూఫ్ రాజా' అంటే బావుంటుందనేది ధియేటర్ బయట టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement