దంగల్‌ బాటలో సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ | Secret Superstar will release in China says Aamir Khan | Sakshi
Sakshi News home page

దంగల్‌ బాటలో సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌

Oct 29 2017 3:34 PM | Updated on Oct 29 2017 5:09 PM

Secret Superstar will release in China says Aamir Khan

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలో తెరకెక్కిన సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్‌తో పాటు ఓవర్‌సీస్‌ లో మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమాను త్వరలో చైనాలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నటుడు ఆమిర్‌ ఖాన్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వెల్లడించారు. ఆమిర్‌ హీరోగా తెరకెక్కిన దంగల్‌ గతంలో చైనాలో రిలీజ్‌ అయి అక్కడ కూడా వసూళ్ల సునామి సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ కూడా మరోసారి సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నాడు మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌.

జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ సినిమాకు అద్విత్‌ చందన్‌ దర్శకుడు. అక్టోబర్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతోపాటు రికార్డ్‌ కలెక్షన్లతో సత్తా చాటింది. ఇప్పుడు మరిన్ని రికార్డ్‌ ల మీద కన్నేసిని ఆమిర్‌ టీం సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ ను చైనాలో భారీగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement