ఇక సుప్రీంలో సల్మాన్ కేసు విచారణ | SC to final hearing SalmanKhan 2002 Hit & Run Case | Sakshi
Sakshi News home page

ఇక సుప్రీంలో సల్మాన్ కేసు విచారణ

Jul 5 2016 1:48 PM | Updated on Oct 8 2018 6:22 PM

ఇక సుప్రీంలో సల్మాన్ కేసు విచారణ - Sakshi

ఇక సుప్రీంలో సల్మాన్ కేసు విచారణ

బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను హిట్‌ అండ్ రన్‌ కేసు వెంటాడుతోంది. ఈ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను హిట్‌ అండ్ రన్‌ కేసు వెంటాడుతోంది. ఈ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా వెంటనే విచారణను ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరగా, 6 నెలల తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.

2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్‌లో మద్యం సేవించి,  మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్‌ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై వాహనంతో దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయపడ్డారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సెషన్‌ కోర్టు సల్మాన్ను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కాగా బాంబే హైకోర్టు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement