రొమాంటిక్ ఎంటర్‌టైనర్

నందు, ప్రియాంకా శర్మ జంటగా నటించిన చిత్రం ‘సవారి’. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన సాహిత్ మోతుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్ పతాకాలపై సంతోశ్ మోతుకూరి, నిషాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. జంతు నేపథ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఫ్రెష్ స్టోరీతో నిర్మించిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: మోనిశ్ భూపతిరాజు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి