5 సోమవారాలు 5 పాటలు | sarileru neekevvaru songs release on every monday | Sakshi
Sakshi News home page

5 సోమవారాలు 5 పాటలు

Nov 30 2019 12:29 AM | Updated on Nov 30 2019 12:29 AM

sarileru neekevvaru songs release on every monday - Sakshi

మహేశ్‌బాబు

డిసెంబర్‌ను మ్యూజికల్‌ డిసెంబర్‌గా మార్చేయాలని ప్లాన్‌ చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. విజయ్‌శాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి మా శక్తి మేరకు కష్టపడ్డాం. సినిమాలోని ప్రతీ పాట అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ్ర పసాద్‌. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement