పాటతో ప్యాకప్‌ | sarileru neekevvaru movie shooting completed | Sakshi
Sakshi News home page

పాటతో ప్యాకప్‌

Dec 20 2019 12:21 AM | Updated on Dec 20 2019 12:21 AM

sarileru neekevvaru movie shooting completed - Sakshi

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. దీంతో షూటింగ్‌కు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరించిన ‘మైండ్‌ బ్లాక్‌..’ పాటతో సినిమా పూర్తయిందని తెలిసింది. ‘‘ఈ ఏడాది జూలై 5న ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, డిసెంబరు 18న ముగించాం. ఈ సినిమా షూటింగ్‌ మంచి ప్రయాణంలా సాగింది’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి11న సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement