బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

sarileru neekevvaru first look released on august 9 - Sakshi

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్‌బాబు గెటప్‌కు సంబంధించిన లుక్స్‌ కొన్ని నెట్టింట్లో వైరలయ్యాయి. కానీ అవి అంత క్లారిటీగా లేవు. ఫుల్‌ క్లారిటీగా ఉన్న ఫొటోలను త్వరలో చూసే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 9న మహేశ్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’లోని మహేశ్‌ లుక్‌ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

ఇందులో మహేశ్‌బాబు ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రైల్వేస్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top