స్విస్‌లో... సర్దార్ రొమాన్స్! | Sardaar Gabbar Singh Release Date April 8 | Sakshi
Sakshi News home page

స్విస్‌లో... సర్దార్ రొమాన్స్!

Mar 25 2016 11:37 PM | Updated on Mar 22 2019 5:33 PM

స్విస్‌లో... సర్దార్ రొమాన్స్! - Sakshi

స్విస్‌లో... సర్దార్ రొమాన్స్!

అతనేమో రఫ్ ఆడించే పోలీసాఫీసర్... పేరు గబ్బర్‌సింగ్. గూండాలకు అతనంటే హడల్. ఎందుకంటే , ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. టన్నుల కొద్దీ తిక్క.

అతనేమో రఫ్ ఆడించే పోలీసాఫీసర్... పేరు గబ్బర్‌సింగ్. గూండాలకు అతనంటే హడల్. ఎందుకంటే , ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. టన్నుల కొద్దీ తిక్క. కానీ, లెక్క కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. ఎక్కడికెళ్లినా అంతే. చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు. తేడా వస్తే మటాషే. ఓ అమ్మాయిని కాపాడడం కోసం రతన్‌పూర్‌లో అడుగుపెడతాడు. ఆ అమ్మాయేమో అందాల సుకుమారి... కోటకు యువరాణి.... పేరు ఆర్షి.
 
 ఎంతోమంది అమ్మాయిలు వెంటపడినా పట్టించుకోని ఈ గబ్బర్‌సింగ్... ఎంతోమంది అబ్బాయిలు వెంటపడినా పట్టించుకోని ఈ చేప కళ్ల చిన్నది ప్రేమలో పడిపోతారు. ఇద్దరూ స్విట్జర్లాండ్‌లో హ్యాపీగా డ్యూయెట్ పాడుకోవడా నికి వెళిపోయారు. గబ్బర్‌సింగ్ పాత్రలో గతంలో విజృంభించిన పవన్ కల్యాణ్ ఇప్పుడీ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో కూడా తనదైన శైలిలో రెచ్చిపోనున్నారు. యువరాణిగా కాజల్ అలరించనున్నారు.
 
 నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాం. డబ్బింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని నిర్మాత శరత్‌మరార్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: పవన్‌కల్యాణ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: బాబి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement