ఎలా విడిపోయారు? | Sarasudu movie in telugu | Sakshi
Sakshi News home page

ఎలా విడిపోయారు?

Jun 8 2017 1:07 AM | Updated on Sep 5 2017 1:03 PM

ఎలా విడిపోయారు?

ఎలా విడిపోయారు?

శింబు, నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి దాకా వెళ్లి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమకి ఫుల్‌స్టాప్‌ పెట్టాక ఈ మాజీ ప్రేమికులు కలిసి నటించిన తమిళ చిత్రం

శింబు, నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి దాకా వెళ్లి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమకి ఫుల్‌స్టాప్‌ పెట్టాక ఈ మాజీ ప్రేమికులు కలిసి నటించిన తమిళ చిత్రం ‘ఇదు నమ్మ ఆళ్‌’. పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్‌ ఫిలింస్‌పై టి.రాజేందర్‌ నిర్మించిన ఈ చిత్రం ‘సరసుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది.

టి.రాజేందర్‌ మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్‌వేర్‌ రంగంలోని యువతీ యువకులు ఎలా ప్రేమలో పడుతున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా చిన్నబ్బాయి కుళల్‌ అరసన్‌ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడు. నయనతార, ఆండ్రియా, అదా శర్మ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. జులైలో ఈ సినిమా రిలీజుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌.

Advertisement
 
Advertisement
Advertisement