మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్' | Sampath Nandi next film Paper Boy | Sakshi
Sakshi News home page

మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్'

Jun 8 2017 11:07 AM | Updated on Sep 5 2017 1:07 PM

మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్'

మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్'

దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న సంపత్ నంది నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ హీరోగా

దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న సంపత్ నంది నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ హీరోగా రచ్చ, రవితేజతో బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్స్ అందించిన ఈ మాస్ డైరెక్టర్, ప్రస్తుతం గోపిచంద్ హీరోగా గౌతమ్నంద సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను నిర్మించబోయే సినిమా పనులు మొదలెట్టాడు సంపత్ నంది.

గాలిపటం సినిమాతో నిర్మాతగా మారిన సంపత్ నంది ఆ సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. దీంతో నిర్మాణానికి కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. తను నేను ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా ఐశ్వర్యను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పేపర్ బాయ్ అనే టైటిల్ను ఫైనల్ చేశారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement